30 ఏళ్ల సుదీర్ఘ పోరాటమే ఏబీసీడీ వర్గీకరణ…

30 ఏళ్ల సుదీర్ఘ పోరాటమే ఏబీసీడీ వర్గీకరణ…
జిల్లా అధ్యక్షులు కలకొండ యాదగిరి…
వెల్దండ, ఆంధ్రప్రభ : 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం వేలాది మంది త్యాగాలు అలుపెరుగని ఆశయాల ఫలితంగా ఏ బి సి డి వర్గీకరణ నావా తీరం చేరుకుంది జిల్లా అధ్యక్షులు కలకొండ యాదగిరి అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో విజయం సాధించినప్పటికీ యావత్ మాదిగ సమాజం నిరంతరం ఎదుర్కొంటున్న ఆర్థిక సామాజిక సమస్యలు మాత్రము అలాగే ఉన్నాయని అన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలను జనాభా ప్రకారం మనకు రావాల్సిన వాటా ను సాధించుకునేందుకు మరో చరిత్రమైన పోరాటానికి సమయ ఆసన్నమైంది తెలిపారు. భూముల దోపిడి లీడ్ క్యాప్ దళితుల అసైన్డ్ భూములు నేడు అన్యాక్రాంతం అవుతున్నాయి నిరుద్యోగ మోసం రుణాల పేరుతో అప్లికేషన్ చేయించుకుని నిరుద్యోగ ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లుతుంది అన్నారు. ఈ కార్యక్రమం లో ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు కసిపాకుల కుమార్ కంబాలపల్లి శ్రీను కంబాలపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
