Assembly| శాసనసభ ఆవరణలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్ : తెలంగాణలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శాసన మండలి, శాసనసభలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో స్పీకర్‌, మండలి చైర్మన్‌ సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మండలి ఆవరణ, శాసనసభ ఆవరణలో జాతీయ పతాకాన్ని మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు విజయశాంతి, కోదండరాం, అద్దంకి దయాకర్, అమీర్ అలీ ఖాన్, అంజిరెడ్డి , దయనంద్, తక్కెళ్ళపల్లి రవిందర్ రావు, వాణీదేవి సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Leave a Reply