AP | అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు..

ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టనున్న పూర్తి బడ్జెట్ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ క్రమంలో ఈ నెల 6న సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి.. అసెంబ్లీ పనిదినాలు, బడ్జెట్‌ సమర్పణ తేదీలను కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించనున్నారు. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడు వారాలకు పైగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువ‌ రోజులు సమావేశాలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Leave a Reply