Assembly | బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్

Assembly | బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్
Assembly | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రత్యక్ష ఆరోపణలతో అసెంబ్లీలో వాతావరణం వేడెక్కింది. సమావేశాలకు హాజరైన బీఆర్ఎస్ సభ్యులు రాఘవ కన్స్ట్రక్షన్ వ్యవహారంపై సభా సంఘం వేయాలని నినాదాలు చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్ వ్యవహారంపై మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి డిమాండ్ చేస్తున్నారు. పోడియం వైపు వెళ్లేందుకు హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల యత్నంచగా మార్షల్స్ అడ్డుకున్నారు. అయితే బడ్జెట్ పై చర్చను అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ సభ్యులను రెండు రోజులు స్పీకర్ సస్పెన్షన్ చేశారు. ఈ సస్పెన్షన్ ఈ రోజు, రేపు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
హరీశ్‌రావు, కేటీఆర్, తలసాని, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, కౌశిక్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు, పద్మారావు, చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, విజయుడు, కె.పి.వివేకానంద్‌ను సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు రెండు రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు.
