ASR | ప్లాస్టిక్ ప్లేట్ లలో భోజనం చేస్తే..

ASR | ప్లాస్టిక్ ప్లేట్ లలో భోజనం చేస్తే..
ASR, నర్సంపేట, క్రైం, ఆంధ్రప్రభ : ఏఎస్ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ నర్సంపేట ఆధ్వర్యంలో జాతరకు విచ్చేసిన భక్తులకు 5,000 విస్తరాకు ప్లేట్స్, ఉచితంగా అందించి, కరపత్రాల ద్వారా అవగాహన కల్పించారు. వివరాల్లోకి వెళితే.. సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు విచ్చేసిన భక్తులు తాడ్వాయి అడవుల్లో వన భోజనం చేయడానికి వచ్చిన వారికి ప్లాస్టిక్ ప్లేట్ లలో భోజనం చేస్తే.. వచ్చే అనారోగ్య సమస్యల కరపత్రాన్ని అందించి, వారికి 1,2 రోజులకు సరిపడే విస్తరాకు ప్లేట్లను భక్తులకు అందించి వారి దగ్గర ఉన్నటువంటి ప్లాస్టిక్ ప్లేట్లను తీసుకోవడం జరిగింది. ఈ ప్లాస్టిక్ ప్లేట్ లను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి పంపించడం జరుగుతుందని ఏఎస్ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్ తెలిపారు.
కళా బృందంలో ఇద్దరు వ్యక్తులకు, ఒకరు ప్లాస్టిక్ భూత వేషాదరణంతో, మరొకరు విస్తరాకు, స్టీల్ పాత్రల వేషధారణతో మేడారం ముఖ్య గద్దె ప్రాంగణం దగ్గర, జాతర చుట్టూ కలియ తిరుగుతూ భక్తుల అవగాహన కలిగించడం జరిగింది. రాష్ట్రం మొత్తం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా చర్యలు తీసుకోవాలని మా ఆరోగ్యాన్ని రక్షించాలని ప్రజలు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు తంగెళ్ల రవికాంత్, రాము సేవక్, డప్పు బృందం పాల్గొన్నారు.
