- బీఆర్ఎస్ నేతలు వనమా రాఘవ, కిలారు డిమాండ్
- 11వ రోజుకు చేరిన రిలే నిరశన
ఖమ్మం, ఆంధ్రప్రభ : కేటీపీఎస్‌లోని ఆరోవ దశ నిర్మాణ కార్మికులను ఆర్టీజన్‌లుగా తక్షణం తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు వనమా రాఘవ, కిలారు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆర్టీజన్‌లుగా తీసుకోవాలని డిమాండ్‌లో కార్మికులు చేపట్టిన రిలే నిరశన పదకొండవ రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. గతంలో కేటీపీఎస్ కార్మికుల సంక్షేమ కోసం ఎన్నో ఉద్యమాలు, ఆందోళనలు చేశామని వనమా రాఘవ తెలిపారు. 2012-2013లో నాలుగు రోజులు, 6వ దశ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేశామని గుర్తు చేశారు. తమ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.