రోడ్డు భద్రత నియమాలు పాటించాలి…

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి…

  • ఎస్ఐ డి.నరేష్ యాదవ్

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్… అలైవ్ కార్యక్రమం ద్వారా వాహనదారులకు భద్రత నియమాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రఘునాథ్ పల్లి సబ్ ఇన్స్పెక్టర్ దుదిమెట్ల నరేష్ యాదవ్ అన్నారు.

సోమవారం రఘునాథ్పల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆవరణంలో జరిగిన కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ బొల్లం ఉమారాణి అధ్యక్షత వహించగా ఎస్సై పాల్గొని మాట్లాడుతూ…. హెల్మెట్ వినియోగం, సీటు బెల్టు ప్రాధాన్యత, డిప్రెషన్ డ్రైవింగ్ నియమ నియమాలను ప్రతి ఒక్కరు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని ఆయన తెలిపారు.

ఈనెల 16వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బొల్లం ఉమారాణి, ఉప సర్పంచ్ దేవర యాకయ్య, పంచాయతీ కార్యదర్శి బాలకిషన్, వార్డు సభ్యులు యాద రాములు, ఇమ్మడిశెట్టి అనిత, సురేష్ శ్రీనివాస్, వివోఎ లు మినుముల పద్మావతి, కోళ్ల కీర్తన, లక్ష్మి అంగన్వాడి టీచర్లు కవిత, శ్రీలత, నాగమణి, ఆటో యూనియన్ అధ్యక్షులు అడ్డూరి శ్రీనివాస్, గ్రామ ప్రముఖులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply