Arrest | దొంగ‌లు దొరికారు..

Arrest | దొంగ‌లు దొరికారు..

  • అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేసిన కంకిపాడు పోలీసులు

Arrest | కంకిపాడు, ఆంధ్రప్రభ : అంతర్ రాష్ట్ర పగటిపూట ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుడి ఆటలకు కృష్ణాజిల్లా కంకిపాడు పోలీసులు చెక్ పెట్టారు. నిందితుడు కృష్ణ జిల్లాలో 3 చోట్ల, ఎన్టీఆర్ జిల్లాలో 10 చోట్ల దొంగతనాలు చేసి సుమారు 409 గ్రాముల బంగారం దొంగతనం చేసి ఆ బంగారాన్ని ముతుట్టు, మనపురం వంటి ఫైనాన్స్ కంపెనీలలో ఇతరుల పేరుపై తాకట్టు పెట్టించనట్లు నేరం అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.50,00,000 లక్షల ఉంటుందని తెలిపారు. ఆదివారం కంకిపాడు పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో కేసు వివ‌రాల‌ను గన్నవరం డీఎస్‌పీ సీహెచ్.శ్రీనివాసరావు వెల్లడించారు.

మార్చి 4న, 2023లో ఉదయం 11 గంట‌ల నుండి 11.30 గంటల సమయంలో కోలవెన్ను వారి వీధి, కంకిపాడు గ్రామంలో కంకిపాటి శివ శంకర రావు డ్యూటి కి వెళ్ళిన తరువాత, వారి భార్య కంకిపాటి జయలక్ష్మి గుడికి వెళుతూ ఇంటికి తాళం వేసి పిల్లలు వస్తారని ఇంటి తాళం కిటికీలో పెట్టి వెళ్లింది. తిరిగి వచ్చి చూడగా, ఇంటి ఎదురుగా సుమారు 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, తెల్ల చొక్కా, నల్ల ప్యాంట్ ధరించిన వ్యక్తి లోపల నుంచి వస్తుండ‌టంతో.. అతన్ని విచారించగా సరైన సమాధానం చెప్పకుండా వెళ్లిపోయినట్టు తెలిపారు. లోపలికి వెళ్ళి చూడగా బీరువా తెరిచి ఉండి బీరువాలోని నల్లపూసల గొలుసు – 2 కాసులు, రెండు బంగారపు ఉంగరాలు – 1 కాసు, జత చెవి పోగులు – 1 కాసు , కొంత నగదు పోయినట్లు ఫిర్యాదు చేయ‌డంతో కంకిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

విశ్వసీనీయ సమాచారం మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలపై సీఐ. జె.మురళి కృష్ణ ఆధ్వర్యంలో కంకిపాడు ఎస్సై సందీప్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి ఒక టీంగా ఏర్పడి టెక్నికల్, నాన్ టెక్నికల్ అంశాలను ఆధారంగా ఈ రోజు ఉదయం కంకిపాడు గ్రామంలోని పునాదిపాడు ప్లై ఓవర్ దగ్గరకు వెళ్ళి త‌నిఖీలు నిర్వ‌హించారు. అక్కడ విజయవాడ వైపు వెళ్ళే సర్వీస్ రోడ్డు దగ్గర సుమారు 20 నుండి 25 ఏళ్ల మధ్య వయసు గల ఐదుగురు వ్యక్తులు పోలీస్ వారిని గమనించి రెండు మోటార్ సైకిళ్ళపై పారిపోవుటకు ప్రయత్నించగా, ఎస్ఐ వారి సిబ్బంది సహాయంతో అదుపులోకి తీసుకున్నారు.

వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. పగటిపూట దొంగతనాలకు పాల్పడుతున్న పున్నాన రాంబాబు, మిగిలిన నలుగురు ముత్తూట్ , మనప్పురం వంటి గోల్డ్ ఫైనాన్స్ కంపనీలలో వారి పేర్ల పై బంగారాన్ని తాకట్టు పెట్టగా, వచ్చిన ధనంతో జల్సాలకు ఉపయోగించుకున్నట్లు నేరం అంగీకరించారు. వారి వద్ద నుంచి సమాచారం సేకరించి వారు చెప్పిన వివరాల ప్రకారం దొంగిలించబడిన సొత్తును స్వాధీనం చేసుకోవడం జరుగుతుందన్నారు.

ముద్దాయి గతంలో శ్రీకాకుళం జిల్లాలో – 29, విజయనగరం జిల్లాలో – 14, విశాకపట్నం జిల్లాలో – 2, ఎన్టీఆర్ జిల్లాలో – 2, ఏలూరు జిల్లాలో – 2, గుంటూరు జిల్లాలో – 1 మొత్తం – 50 ఉన్నాయని తెలిపారు. నేరస్తుడు ప్రస్తుతం చేసిన నేరాల వివరాలైన కృష్ణ జిల్లా కంకిపాడు – 1, గన్నవరం – 2, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం – 5, భవానిపురం – 2, నున్న – 2, పటమట – 1 = మొత్తం – 13 ఉన్నాయని తెలిపారు. నల్లపూసల గొలుసు – 1, గోల్డ్ రింగ్స్ –2, చెవి దిద్దులు – 1 జత, మొత్తం – 32 గ్రాములు సీజ్ చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా దొంగను చాకచక్యం పట్టుకున్న పోలీసులకు రివార్డులు ప్రకటించారు

Leave a Reply