పదవ తరగతి పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు పూర్తి

పదవ తరగతి పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు పూర్తి

ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయాలి
ములకలపల్లి మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ

ములకలపల్లి, ఆంధ్రప్రభ : మార్చి 14 నుండి జరిగే పదవ తరగతి పరీక్షల కోసం ములకలపల్లిలో పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ అన్నారు. ములకలపల్లి మండలంలో మొత్తం 301 మంది విద్యార్థిని,విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ములకలపల్లి హైస్కూల్ పరీక్ష కేంద్రంలో 151 మంది, గురుకులం పరీక్ష కేంద్రంలో 150 మంది పరీక్షలు రాయనున్నారన్నారు.

వీరిలో బాలికలు 182 మంది, పురుషులు 119 మంది పరీక్షలు రాయనున్నారని, వీరందరికీ మౌలిక వస్తువులు కల్పించడమే కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని వైద్య ఆరోగ్యశాఖ సైతం తమ సేవలు అందిస్తుందని,పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు శాఖ 144 సెక్షన్ విధించడం జరిగిందని,కాబట్టి విద్యార్థిని విద్యార్థులు అందరూ నిర్భయంగా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని కోరారు. విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Leave a Reply