Army vehicle | జమ్మూ కశ్మీర్‌లో ఘోర ప్రమాదం

Army vehicle | జమ్మూ కశ్మీర్‌లో ఘోర ప్రమాదం
- 10మంది జవాన్లు మృతి
- ఏడుగురికి గాయాలు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
Army vehicle | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదానికి జరిగింది. 17 మంది జవాన్లతో వెళ్తున్న ఆర్మీ వాహనం అదుపు తప్పి 200 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పంది మంది జవాన్లు మరణించారు. ఖన్నీ టాప్ వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన ఏడుగురిని మందిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఉదంపూర్‌కు తరలించారు. భదేర్వా-చంబా అంతరాష్ట్ర రహదారిపై ఖన్నీ టాప్ సమీపంలో గురువారం ఈ ప్రమాదం చోటుచేసుకుందని పేర్కొన్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆర్మీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.
