Aregudem | స్వప్న మహిపాల్ రెడ్డిని గెలిపిస్తే…

Aregudem | స్వప్న మహిపాల్ రెడ్డిని గెలిపిస్తే…
- ఆరెగూడెం అభివృద్ధి
- బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాపరెడ్డి, తిరుపతిరెడ్డిలు
- సమస్యల పరిష్కారమే ద్యేయంగా పనిచేస్తా
- ఇంటింటి ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థి స్వప్న మహిపాల్ రెడ్డి
Aregudem | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెం గ్రామంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మునుగాల స్వప్న మహిపాల్ రెడ్డి గెలుపుతోనే ప్రజల సమస్యలు పరిష్కారమై… గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ రాష్ట్ర నాయకులు మన్నె ప్రతాపరెడ్డి, మునుగాల తిరుపతిరెడ్డిలు తెలిపారు. ఆరెగూడెం గ్రామంలో సోమవారం సర్పంచ్ అభ్యర్థి మునగాల స్వప్న మహిపాల్ రెడ్డితో కలిసి వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామ పంచాయతీలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిధులను విడుదల చేయడం జరుగుతుందని, గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం కోసం రాష్ట్రంలోని కేంద్ర మంత్రుల సహకారంతో అధిక నిధులను తీసుకురావడం జరుగుతుందన్నారు.
ప్రజాసేవయే లక్ష్యంగా పెట్టుకొని మునగాల స్వప్న మహిపాల్ రెడ్డిలు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. అరెగూడెం గ్రామ సర్పంచ్ గా మునగాల స్వప్న మహిపాల్ రెడ్డికి కేటాయించిన కత్తెర గుర్తుపై పార్టీలకు అతీతంగా గ్రామస్తులంతా పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించాలని ప్రతాపరెడ్డి, తిరుపతిరెడ్డిలు పిలుపునిచ్చారు. సర్పంచ్ అభ్యర్థి స్వప్న మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ… తనకు కేటాయించిన కత్తెర గుర్తుపై పెద్ద ఎత్తున ఓట్లు వేసి తనను సర్పంచ్ గా గెలిపిస్తే మీకు అందుబాటులో ఉండి నిరంతరం సేవ చేస్తానని, గ్రామంలోని అన్ని సమస్యలను పరిష్కరించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇస్తూ ఇంటింటికి తిరిగి గ్రామస్తులను ఓట్లు అభ్యర్థించారు. గ్రామ సర్పంచిగా స్వప్న మహిపాల్ రెడ్డిని గెలిపిస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని గ్రామస్తులు కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులతో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
