April23 | మోడీగారి ధ్యేయం-తమిళనాట కమల వికాసం

April23 | మోడీగారి ధ్యేయం-తమిళనాట కమల వికాసం
April23 | దక్షిణాదిలో కమలానికి సవాళ్లు
తమిళనాడు రాజకీయాల ప్రత్యేకత
బీజేపీ ప్రయత్నాలు… ఫలితమేమిటి?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : భారత్ మొత్తం కమలంలోనే ఉంది..అక్కడక్కడా ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతున్నా, వాటిపై మోడీగారి దృష్టి లేకపోలేదు. అవి కూడా ఏనాటికైనా కమలంలోకే రాకపోతాయా అని ఆలోచన లేకపోలేదు. కానీ, అన్ని రాష్ట్రాల పరిస్థితులూ, రాజకీయాలూ, ప్రాంతీయ భావాలూ ఒకేలా ఉండవు. అందునా దక్షిణాది రాష్ట్రాల తీరుతెన్నులే వేరు. వాటిలొ పాగా వేయడం కేంద్రానికి అంత సులభమేమీ కాదు. కొట్టుకున్నా, కలిసున్నా మాకు మేమే అన్నట్లుండే రాష్ట్రం తమిళనాడు.

ఎన్నికలకు ముందు నుంచే వేడెక్కిన రాజకీయాలు తమిళనాడులో బీజేపీని తలమునకలయ్యేలా చేస్తున్నాయి. అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవాలని తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇదే విషయాన్ని ఉగాది పచ్చడి కావాలంటూ మోడీగారు అమిత్ షా తో అంటున్న ఈ కార్టూన్ లో అర్థం చేసుకోవాల్సింది వేరే ఉంది. ఆ వేరే ఏమిటో కార్టూన్ ఇష్టులైన ఆంధ్రప్రభ పాఠకులకు బాగా తెలుసు.
