చెన్నూరులో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

చెన్నూరులో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో బిజెపి 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపీ కార్యాలయం పైన భారతీయ పార్టీ జెండాను పట్టణ బీజేపీ అధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్ ఎగరవేయడం జరిగింది. అనంతరం పట్టణ అధ్యక్షులు ఆవిర్భావ దినోత్సవం గురించి మాట్లాడుతూ 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగిందని అప్పుడు పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎల్కే అద్వాని ఆధ్వర్యంలో ఏర్పాటు అయ్యిందని ఈ పార్టీకి అప్పుడు అటల్ బీహార్ వాజ్పేయి గారు అధ్యక్షత వహించార‌న్నారు.

భారత జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత రెండు లోక్సభ స్థానాలతో మొదలై ఈరోజు వరుసగా మూడోసారి కూడా ప్రధానిగా కొనసాగడం బీజేపీ బలమైన విధివిధానాలను ఎంత పటిష్టంగా ఉన్నాయో అని అందరికీ తెలియజేస్తుందని అన్నారు. పార్టీ సిద్ధాంతం నేషన్ ఫస్ట్ అదేవిధంగా అంత్యోదయ సిద్ధాంతాల మీద నడుస్తుందని, ప్రజా సేవే లక్ష్యంగా కార్యకర్తల బలంతో ఈరోజు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ముందుకు సాగుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం చారిత్రక కొన్ని నిర్ణయాలను తీసుకోవడం జరిగిందని తెలియజేస్తూ ఆర్టికల్ 370 రద్దు అదేవిధంగా రామాలయ నిర్మాణం భారత జనతా పార్టీతోనే సాధ్యమైందని చెప్పారు.

అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సంకల్పం ప్రతి సామాన్య కార్యకర్త వికసిద్భారత్ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ కార్యదర్శి రత్న లక్ష్మీనారాయణ, పట్టణం మాజీ అధ్యక్షులు జాడి తిరుపతి గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు కెవిఎం శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి కాయిత వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply