APPSC |గ్రూప్ 2 మెయిన్స్ ప‌రీక్ష‌లు య‌థాత‌థం….

అమరావతి: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) క్లారిటీ ఇచ్చింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు రేపు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 జరుగుతుందని కమిషన్ తెలిపింది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొంది. గ్రూప్-2 మెయిన్స్ వాయిదా అంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న తప్పుడు ప్రచారం నమ్మొద్దని కమిషన్ సూచించింది. అభ్య‌ర్ధులు నిర్ణీత స‌మ‌యానికి ప‌రీక్షా కేంద్రాల‌కు చేరుకోవాల‌ని కోరింది.. ఎటువంటి ఎల‌క్ర్టానిక్ గాడ్జెట్స్ ను అనుమ‌తించ‌బోమ‌ని తెలిపింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *