క్రీడా శాఖ మంత్రి మాండవీయాకు చంద్రబాబు వినతి
న్యూ ఢిల్లీ – ఖేలో ఇండియా (Khel India ) నిధులివ్వాలని కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు (central Minister Mandaviya ) ఎపి సిఎం చంద్రబాబు (ap cm chandrababu ) విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో పర్యటనలో ఉన్న చంద్రబాబు నేడు కేంద్ర మంత్రి మాండవీయను చంద్రబాబు కలిశారు. ఏపీలో స్టేడియంల నిర్మాణం, క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి రూ. 341 కోట్లు కేటాయింపుల అంశంపై చర్చించారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ది కోసం చేపట్టాల్సిన ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. అమరావతిలో జాతీయ జల క్రీడల శిక్షణా హబ్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.. ఎపిలో క్రీడల అభివృద్ధికి కేంద్ర పరంగా తగిన సహాయం చేయాలని కోరారు.. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అమరావతిలో జాతీయ జల క్రీడల శిక్షణ హబ్ ఏర్పాటుకు అవకాశం ఉందని, కృష్ణా నదీ తీరంలో వాటర్ స్పోర్ట్స్ శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు అవకాశాలున్నాయని వివరించారు, నాగార్జునా యూనివర్సిటీ, కాకినాడలలో నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్టు వెల్లడించారు. తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, నరసరావుపేటలలో ఖేలో ఇండియా కింద మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను పూర్తి చేయాలని పేర్కొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి రూ.27 కోట్లు, గుంటూరు బీఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు రూ.170 కోట్లు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి రూ.341 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, మరో కేంద్ర మంత్రి చంద్రశేఖర్, ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా పాల్గొన్నారు..