AP | బావమరిదిని హత్య చేసిన నిందితుడిపై కాల్పులు

AP | బావమరిదిని హత్య చేసిన నిందితుడిపై కాల్పులు

AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఐదేళ్ల బాలుడి హత్య కేసులో నిందితుడు పోలీసులపై తిరగబడడంతో అనంతపురం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులకు దిగాల్సి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా యాడికిలో బావమరిది అయిన ఐదేళ్ల బాలుడిని హత్య చేసిన కేసులో నిందితుడు సర్వేశ్‌కుమార్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఘటనాస్థలికి నిందితుడిని తీసుకెళ్తున్న సమయంలో అతడు అకస్మాత్తుగా పోలీసులపై తిరగబడ్డాడు.

ఖాళీ బీరు సీసాతో దాడికి దిగిన నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ముందుగా గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. అయినప్పటికీ అతడు వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు సీఐ నిందితుడి మోకాళ్లపై కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో సీఐ రామసుబ్బయ్యతో పాటు మరో కానిస్టేబుల్‌, నిందితుడు సర్వేశ్‌కుమార్ గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.

Leave a Reply