AP | రైల్వే సీఐ భార్య ఆత్మహత్య

AP | రైల్వే సీఐ భార్య ఆత్మహత్య
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ధర్మవరంలో రైల్వే సీఐ అశోక్ భార్య చాముండేశ్వరి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు షాక్‌కు గురయ్యారు. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
