ఆదర్శంగా నిలిచిన యువకుడు..

ఆదర్శంగా నిలిచిన యువకుడు..

కుల – మతాలకు వీడ్కోలు
ఇక పై నో క్యాస్ట్ – నో రిలీజియన్
సమాజంలో సమానత్వం కోసం గౌతమ్ సంచలన నిర్ణయం

అవనిగడ్డ – ఆంధ్రప్రభ : తాను జన్మతః హిందూ మతంలో జన్మించి, కాపు కులానికి చెందిన తనకు, ఇకపై కుల, మత వ్యవస్థల నుండి పూర్తిగా బయటకు వచ్చి, “నో కాస్ట్ – నో రిలీజియన్” గా కుల, మతాల గుర్తింపును తానే అధికారికంగా త్యజించి, విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు గౌతమ్ తెలిపారు. భారత రాజ్యాంగంలోని వ్యక్తిగత స్వేచ్ఛ (ఆర్టికల్ 25) ఆధారంగా, ఎటువంటి కులాన్నీ, మతాన్నీ ఇకనుండి అనుసరించడం లేదని, కానీ అన్ని మతాలను, కులాలను వారి మనోభావాలను సమదృష్టి తో గౌరవిస్తానని గౌతమ్ తెలిపారు.., హిందూ మతానికి మరియు ఇతర మతాలకు సంబంధించిన సిద్ధాంతాలను, ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను ఇకనుండి పాటించబోనని గౌతమ్ ప్రకటించారు.

గతంలో తన కులానికి మరియు మతానికి సంబంధించి తనకు వర్తించిన సమస్త హక్కులను, రిజర్వేషన్ లను, ప్రభుత్వ ప్రయోజనాలను నేటి వరకు పొందలేదని, భవిషత్తులో కూడా పొందబోనని గౌతమ్ సెల్ఫ్ – డిక్లరేషన్ ద్వారా వెల్లడించారు.
యువతలో అవగాహన పెoచి కుల, మత రహిత నవ సమాజ నిర్మాణానికి ఇది ఒక మార్గదర్శక చర్యగా ఉండాలని, సమాజంలో కులవివక్ష, మత విభేదాలను తొలగించి సమానత్వాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతి రావు పూలే గారి జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గౌతమ్ తెలియజేశారు.

Leave a Reply