AP | తిరువూరు చైర్మన్ పీఠం టిడిపిదే…

ప్రశాంతంగా చైర్మన్ ఎన్నిక ప్రక్రియ…
హాజరైన టిడిపి, వైసిపి కౌన్సిలర్లు..
టిడిపికి మద్దతుగా 11 ఓట్లు…
9 కే పరిమితమైన వైసీపీ బలం…
మున్సిపల్ చైర్ పర్సన్ గా నిర్మల…
ఎన్నిక ధ్రువ పత్రం అందజేసిన ఆర్డీవో మాధురి…
శుభాకాంక్షలు తెలిపిన అధికారులు, నాయకులు….
కార్యాలయం చుట్టూ 144 సెక్షన్..
పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు…

(తిరువూరు, ఆంధ్రప్రభ) అందరూ అనుకున్నట్లే తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఎంతో ఉత్కంఠత, ఎన్నో మలుపులు తిరిగిన చైర్మన్ ఎన్నికను గట్టి బందోబస్తు మధ్య సోమవారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ తరపున చైర్మన్ గా 1వ వార్డు కౌన్సిలర్ కొలికపోగు నిర్మల ను బలపరుస్తూ 11 మంది కౌన్సిలర్లు మద్దతు తెలుపగా, వైసీపీ తరఫున 15వ వార్డు ప్రసాద్కు అనుకూలంగా 9 ఓట్లు నమోదు అయ్యాయి. దీంతో అత్యధిక కౌన్సిలర్ల ఓటింగ్ పొందిన నిర్మలను చైర్ పర్సన్ గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తిరువూరు ఆర్డీవో మాధురి ప్రకటించారు. నాయకులు అధికారులు సమక్షంలో ఆమెకు చైర్పర్సన్ గా నియామక పత్రాన్ని అందజేశారు.

…. ప్రశాంతంగా ఓటింగ్…

ఇప్పటికే రెండుసార్లు కోరం లేక వాయిదా పడుతూ వస్తున్న తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఆదివారం ప్రశాంత వాతావరణంలో జరిగింది. గడిచిన రెండుసార్లు జరిగిన ఎన్నికల సందర్భంగా కార్యాలయ పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడం, తెలుగుదేశం వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, వాదోపవాదనలు, తోపులాటలతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రెండోసారి నిర్వహించిన ఎన్నికల్లో వైసిపి కౌన్సిలర్లు ఎన్నికకు హాజరు కాకపోవడంతో వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మూడోసారి జూన్ రెండవ తేదీన ఎన్నిక నిర్వహించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహిని అధికారిక ఉత్తరులతో అధికారులు ఎన్నికను నిర్వహించారు. మొత్తం 20 వార్డులు, తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు ఎక్స్ అఫీషియల్ ఓటుతో 21 ఓట్లలో 11 టిడిపికి అనుకూలంగా, 9 వైసిపి కనుకూలంగా ఉండగా, మరో వైసిపి వార్డు కౌన్సిలర్ అమెరికాలో ఉండడంతో హాజరు కాలేకపోయారు. చేతులు ఎత్తి చైర్మన్ ఎన్నుకునే ప్రక్రియలో భాగంగా 11 మంది నిర్మలకు అనుకూలంగా చేతులెత్తగా, మోదుగ ప్రసాద్ కి అనుకూలంగా 9 మంది వైసీపీ కౌన్సిలర్లు ఓటు వేయడంతో నిర్మల ను చైర్పర్సన్ గా ఎంపిక చేస్తూ రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకున్నారు.

….. పటిష్ట బందోబస్తు….

తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాలతో పాటు మున్సిపల్ కార్యాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నిక జరిగే కార్యాలయ ప్రాంతంలో 144వ సెక్షన్ విధించిన పోలీసులు ఎన్నిక బందోబస్తు కోసం 20 మంది పోలీసులు పాల్గొన్నారు. ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఎన్నికకు హాజరయ్యా కౌన్సిలర్లకు అవసరమైన సెక్యూరిటీని కల్పించారు. ఎన్నిక జరిగే ప్రాంతంలోకి కౌన్సిలర్లకు తప్ప మరి ఎవరికి ప్రవేశం లేకుండా భారీ కేట్లను ఏర్పాటు చేశారు.

Leave a Reply