AP చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి..

వి.కోట – ఆంధ్రప్రభ : వి కోట మండల పరిధిలోని కృష్ణాపురం పంచాయతీ మోట్లపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు చెరువులో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. గురువారం మధ్యాహ్నం సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు చెరువులో ఓ చోట గుంత లోతుగా ఉండటంతో అందులో కూరుకుపోయారు…. అది ఊబి కావ‌డంతో వెళ్లి బయటకు రాలేకపోయారు. కాగా, ఎంతసేపటికి యువకులు నీటి నుంచి బయటకు రాకపోవడంతో ప్రమాదాన్ని ఊహించిన గట్టు పైనున్న సహచరులు వారిని బయటకు తీశారు. అయితే ఇద్దరు యువకులు అప్పటికే మృతిచెందగా ఓ యువకుడికి వీకోట ఆసుపత్రి తరలించారు.. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికి అతను మృతి చెందినట్లు ధృవీకరించారు..మ‌ర‌ణించిన వారు కుషాల్.. నిఖిల్ ..జగన్.. గా గుర్తించారు.. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు ఉండటం గమనార్హం

Leave a Reply