AP | చెరువులో పడి ముగ్గురు మృతి.. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం..

చిత్తూరు : అన్నమయ్య జిల్లాలో మొలకలచెరువులో ప్రమాదవశాత్తు పడి ఒకే కుటుంబంలోని తండ్రి, కూతురు, కొడుకు.. ముగ్గురు మరణించారు. ఈ ప్రమాదంపై విచారం వ్య‌క్తం చేసిన తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి… బాదిత కుటుంబ సభ్యులకు రూ.1,50,000 సహాయం అందించారు.

అదేవిధంగా, కర్ణాటకకు చెందిన స్టీల్ గూడ్స్ విక్రేత కుటుంబానికి చెందిన సభ్యుడు మరణించగా, వారికి రూ.50,000 వేల ఆర్థిక సహాయం అందించారు. మొత్తం రూ.రెండు లక్షల ఆర్థిక సహాయం అందించారు. బాధితుడి కుటుంబ సభ్యులకు ఏ సమస్య ఉన్న.. తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని, వారికి సహాయం చేస్తానని ఆయన బ‌రోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ములకలచెరువు మండల కన్వీనర్ మాధవరెడ్డి, మేదర సంఘం అధ్యక్షుడు తాలె.. సుబ్రహ్మణ్యం, ములకలచెరువు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు టంగుటూరి విశ్వనాథ్‌, కాల్వపల్లి మధుసూధన్‌రెడ్డి, రెడ్డెం కృష్ణా రెడ్డి, ఎంపీటీసీ చాను సిద్దారెడ్డి, రెడ్డప్పారెడ్డి, ములకలచెరువు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో మేదర బాదిక కుటుంబాల‌కు అండగా నిలిచిన పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డికి మేదర సంఘం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply