AP | పాలనా వ్యవస్థలో ‘జీరో కరప్షన్’ ఉండాలి : సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనా వ్యవస్థలో అవినీతి పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఎక్కడైనా అవినీతి జరుగుతుందనే సమాచారం వస్తే వెంటనే దానిపై దృష్టి సారించి, విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చ‌న‌ ఒక సంవత్సర పాలనలో… ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాన్ని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ స‌హా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply