అమరావతి: ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానోపాధ్యాయులు ఐదేళ్లు, ఉపాధ్యాయులు ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తయితే తప్పనిసరిగా బదిలీ కావలసి ఉంటుందని పేర్కొంది..
కేటగిరి -1కి ఒక పాయింట్, కేటగిరి-2కి రెండు పాయింట్లు, కేటగిరి-3కి మూడు పాయింట్లు, కేటగిరి-4కి ఐదు పాయింట్లు, ఐదు స్టేషన్ పాయింట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
సర్వీస్ పాయింట్లు ఏడాదికి 0.5గా పేర్కొంది. మే 31 నా CTటికి ఖాళీలు, పదవీ విరమణ చేసే స్థానాలు, హేతుబద్ధీకరణ ఖాళీలు, తప్పనిసరిగా బదిలీ అయ్యే స్థానాలు, ఏడాదికిపైగా గైర్హాజరైన టీచర్ల ఖాళీలు, స్టడీ లీవ్ ఖాళీలను చూపించినున్నట్లు ప్రభుత్వం వివరించింది.
