AP / బ‌డ్జెట్ ను ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మ‌య్యే రీతిలో చెప్పండి…. స‌భ్యుల‌కు స్పీక‌ర్ సూచ‌న ..

వెల‌గ‌పూడి – నష్ట పోయిన రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉందని సూచించారు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు.. చాలా మంది కొత్త సభ్యులు ఉన్నార‌ని.. దాంతో పాటు.. ఇప్పటికే ఎన్నో బడ్జెట్‌లను చూసిన‌ సభ్యులు కూడా ఉన్నారని తెలిపిన ఆయన.. బడ్జెట్ ను అందరూ చదవాల‌ని కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,22,359 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. దీంతో, తొలిసారిగా రూ. 3 లక్షలు కోట్లు దాటింది రాష్ట్ర బడ్జెట్. సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో రూ. 3 లక్షల కోట్లు దాటేసింది.. ఇక, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన తర్వాత . సభలోని సభ్యులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు అయ్యన్నపాత్రుడు..


బడ్జెట్ పత్రాలను అన్ని పెన్ డ్రైవ్ లో ఇచ్చామ‌ని అంటూ సభ్యులు వాట్సాఅప్ గ్రూప్ లో పెట్టుకోవాల‌న్నారు. డ్జెట్ ను అందరూ స్టడీ చేయాలన్న కోరారు. ప్రతి ఒక్కరికి బడ్జెట్ పై అవగాహన ఉండాలన్నారు.. ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో బడ్జెట్ ను సరళమైన భాష లో జనంలోకి తీసుకు వెళ్లాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు.. రాష్ట్ర అభివృద్ధిలో సహకారం అందించాలన్నారు స్పీకర్ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *