AP Rains | ఏపీలో వర్షాలు..

AP Rains | ఏపీలో వర్షాలు..

AP Rains, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తమిళనాడు, (Tamilnadu) పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో కొనసాగుతుంది. ఇది ఉత్తర దిశగా కదులుతుంది. అలాగే ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమాంతరంగా ప్రయాణించనుందని వాతావరణ శాఖ తెలియచేసింది. ఈ రోజు పొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, డా.బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ సూచించింది. కాకినాడ, (Kakinada) తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశ ఉంది. ఈరోజు మత్స్యకారులు వేటకు వెళ్లద్దని విశాఖలోని తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలియచేసింది.

Leave a Reply