AP | మళ్లీ వర్ష సూచన..

AP | మళ్లీ వర్ష సూచన..

AP, హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రాష్ట్రానికి (Andhra pradesh) మరోసారి తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం అప్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. ఆతర్వాత 48 గంటల్లో ఇది పశ్చి వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడనుందని పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుందని నిపుణుల అంచనా.

కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి (Tirumala) జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియచేసింది. అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్ర, శని, ఆదివారాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు, సోమవారం, మంగళవారం కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

Leave a Reply