AP | ఆయ‌నే నేర‌స్థుడు.. అందుకే వాళ్ల‌కే అండ – జ‌గ‌న్ పై డిప్యూటీ స్పీక‌ర్ ఫైర్

అమ‌రావ‌తి – నేర చరిత్ర కలిగిన వ్యక్తులను జగన్ పరామర్శించడం దిగజారుడు ఓట్ల రాజకీయాలకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెనాలిలో నేడు రౌడీ షీటర్లకు, గంజాయ్ బ్యాచ్ కు జగన్ అండగా నిలవడాన్ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు.

“రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవనేది జగన్ లాంటి వారిని చూసే పుట్టింది. గంజాయి బ్యాచ్‌ను పరామర్శించి ఆయన రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు” అని రఘురామ వ్యాఖ్యానించారు. నిందితులకు జగన్ అండదండలు అందించడం వంటి చర్యల ద్వారా జగన్ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నిలదీశారు.

గతంలో తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు, జగనే తనను కస్టడీలో కొట్టించారని రఘురామ సంచలన ఆరోపణ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్‌ను చూసి జాలిపడటం తప్ప ఏమీ చేయలేమని ఆయన అన్నారు. “నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైసీపీ నేతల అదృష్టం” అంటూ రఘురామ ఎద్దేవా చేశారు. నేర‌స్తుడు ఎప్పుడూ నేర‌స్థుల‌కే అండ‌గా ఉంటార‌నేది జగన్ వైఖరితో మ‌రోసారి రుజువైంద‌ని అన్నారు.. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు.

Leave a Reply