AP | ఆపరేషన్ ఆక్టోపస్

AP | ఆపరేషన్ ఆక్టోపస్

మావోయిస్టు షెల్డర్ జోన్ పై దాడి
21 మహిళలు, ఆరుగురు పురుషులు..
ప్రజా సంఘాల మహిళ ఆశ్రయం
హిడ్మా గెరిల్లా దళంగా గుర్తింపు..
భారీ ఎత్తున ఆయుధ డంపు స్వాధీనం…


AP | (ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ నిర్వహిస్తూ, అడవుల్లో మావోయిస్టుల (Maoists) కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో విజయవాడలో మావోయిస్టు కదలికలు కలవరం సృష్టించాయి. ఇప్పటివరకు కేవలం అడవుల్లోని దండకారణ్యాల్లోనే మావోయిస్టుల కదలికలు ఉంటుండగా మైదాన ప్రాంతాలలో కూడా సంచారం జాడలు కనిపిస్తున్నాయి. కేంద్ర బలగాలు దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్న నేపథ్యంలో విజయవాడ ను మావోయిస్టులు షెల్టర్ జోన్ గా మలుచుకున్నట్టు సమాచారం. కృష్ణా జిల్లా (Krishna District) లోని పెనమలూరు నియోజకవర్గం న్యూ ఆటోనగర్ ప్రాంతంలో ఒక భవనంలో ఆశ్రయం పొందుతున్న 27 మంది మావోయిస్టులను ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, స్పెషల్ బ్రాంచ్ అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్ లో మహిళా మావోయిస్టులతో పాటు పెద్ద ఎత్తున ఆయుధాలు లభించాయి. సాహిత్యాన్ని పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు.

తాజాగా మంగళవారం తెల్లవారుజామున మారేడుమిల్లి లో జరిగిన జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా (Top leader Hidma) మరణించగా అక్కడ లభించిన ఒక డైరీ ఆధారంగా విజయవాడలో పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ స్థానిక పోలీసులు ఆక్టోపస్ బృందాలు మంగళవారం తెల్లవారుజామున న్యూ ఆటోనగర్ లోని ఒక భవనాన్ని చుట్టుముట్టి అందులో ఆశ్రయం పొందుతున్న మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన ప్రజా సంఘానికి చెందిన ఒక మహిళ విజయవాడ పరిధిలోని న్యూ ఆటోనగర్ లోని ఒక భవనంలో మావోయిస్టులకు ఆశ్రియాన్ని గత నెల రోజులుగా ఇస్తున్నట్లు తెలుస్తోంది. పీపుల్స్ ఆర్మీ గెరిల్లా (People’s Army Guerrilla) కు చెందిన 21 మంది మహిళలు ఆరుగురు పురుష మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు మావోయిస్టు అగ్ర నేత హెడ్మా కు రక్షణగా ఉండేవారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేంద్ర బలగాల సెర్చ్ ఆపరేషన్లు పెరిగిన నేపథ్యంలో ఏపీతోపాటు తెలంగాణలోని మూడు ప్రాంతాలను షెల్టర్ జోన్ గా మార్చుకున్న వీరు ఆయా ప్రాంతాలలో ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్నట్లుగా తెలుస్తోంది.

విజయవాడ (Vijayawada) పరిధిలోని న్యూ ఆటోనగర్ లో ఒక బిల్డింగులో ఆశ్రయం పొందుతున్న మావోయిస్టుల సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు స్పెషల్ బ్రాంచ్ తో పాటు కృష్ణ కృష్ణా జిల్లా ఎస్పీకి సమాచారం అందించిన నేపథ్యంలో ఆక్టోపస్ స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్సీ స్థానిక పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను నిర్వహించారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నేతృత్వంలో, విజయవాడ సి పి ఎస్ వి రాజశేఖర్ బాబు సూచనలతో మావోయిస్టులు ఆశ్రయం పొందుతున్న రహస్య భవనంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు పెద్ద ఎత్తున సాహిత్యం, ఆయుధ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా ఆశ్రయం పొందుతున్న వీరు విజయవాడలోని పలు ప్రాంతాలలో రెక్కీ నిర్వహించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తమ ఉనికినే మైదాన ప్రాంతాలలో కూడా చాటిచెప్పే క్రమంలో ప్రముఖులను టార్గెట్ చేసుకుంటూ నగరంలోని వివిధ ప్రాంతాలలో రెక్కీ నిర్వహించినట్లుగా అనుమానిస్తున్నారు.

మావోయిస్టుల (Maoists) లో అత్యంత ముఖ్యమైన చురుకైన వ్యవస్థగా పీపుల్స్ ఆర్మీ గెరిల్లా సభ్యులు ఉంటారు. వీరు ముఖ్యంగా మావోయిస్టు అగ్రనేతలకు రక్షణ కవచంగా నిలబడడంతో పాటు ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా అగ్రనేతలకు ఎటువంటి ఇబ్బందులు ప్రాణాపాయం నుంచి చాకచక్యంగా తప్పించడంలో పూర్తిగా శిక్షణ పొంది ఉంటారు. గతంలో మావోయిస్టు అగ్ర నేత ఆర్కే కు రక్షణ కవచంగా ఉన్న వీరు చాలా సందర్భాలలో పోలీస్ సెర్చ్ ఆపరేషన్, నుండి హిడ్మాను తప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మావోయిస్టులతో చర్చలు జరిగిన సందర్భంగా ఆర్కే కు రక్షణగా వచ్చిన ఈ పీపుల్స్ గెరిల్లా సభ్యులు అప్పటినుండి వెలుగులోకి వచ్చారు. అయితే ప్రస్తుతం మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతున్న నేపథ్యంలో మరో అగ్రనేత హిడ్మాకు రక్షణగా ఉంటున్న సేఫ్ జోన్ కోసం అన్వేషిస్తూ విజయవాడ హైదరాబాద్ తో పాటు మరో ప్రాంతాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగానే విజయవాడలో వీరు ఆశ్రమం పొందుతూ మంగళవారం జరిగిన పోలీస్ ఆపరేషన్ లో పట్టుబడ్డారు.

Leave a Reply