AP | పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు..

AP | పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు..
AP, హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : త్వరలోనే అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు అందుబాటులోకి తెస్తామని.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోందని ఏపీ హోమ్ మినిష్టర్ అనిత (Anitha Vangalapudi) తెలియచేశారు. వెలగపూడి సచివాలయంలోని కార్యాలయంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజీత్ ఐపీఎస్, స్పెషల్ సెక్రటరీ విజయ్ కుమార్ ఐపీఎస్, పీటీవో ఎస్పీ, ఇతర అధికారులతో కొత్త వాహనాలు కొనుగోలు పై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని అనిత సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు.


