AP Liquor Scam | మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్..

- అరెస్టు వారెంట్‌కు ఏసీబీ కోర్టు నిరాకరణ
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో రాజంపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది.
ముందస్తు బెయిల్ పిటిషన్లు సుప్రీం కోర్టు, హైకోర్టులలో తిరస్కరించబడిన నేపథ్యంలో, సిట్ అరెస్టు వారెంట్ కోసం కోర్టును ఆశ్రయించింది. అయితే, ఏసీబీ కోర్టు సిట్ అభ్యర్థనను తోసిపుచ్చడం గమనార్హం.
