విజయవాడ (ఆంధ్రప్రభ): ఒకరు తన సామాజిక వర్గం రిజర్వేషన్ల కోసం దశాబ్దాలు తరబడి పోరాటం చేస్తుంటే… మరొకరు రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల కన్నీటిని తుడిచేందుకు ఆరోపణలు, అపవాదులు, కేసులు ఎదుర్కొన్న వ్యక్తి. ఇద్దరి కలలు సాకారమైన రోజున ఆత్మీయంగా కలుసుకుంటూ భావోద్వేగా పలకరింపులు చేసుకున్నారు.
ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేయడం తో అంతులేని ఆనందంతో ఉన్న మందకృష్ణ మాదిగ, తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు లు కలుసుకున్నారు.
హైదరాబాదులోని కొలికపూడి శ్రీనివాసరావు స్వగృహానికి వెళ్ళిన మందకృష్ణ మాదిగ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కాసేపు సరదాగా గడిపారు. ఎస్సీ వర్గీకరణ అంశం కూాటమి ప్రభుత్వంలో న్యాయం జరగడం, అందులో కొలికపూడి శ్రీనివాసరావు తీసుకున్న చొరవ ను అభినందిస్తూ మందకృష్ణ మాదిగ కృతజ్ఞతలు తెలిపారు తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ కోసం జీవితాన్ని త్యాగం చేసి, దశాబ్దాలుగా పోరాటం చేయడంతో పాటు, ప్రభుత్వాలన్న సైతం ఎదిరించిన మందకృష్ణ మాదిగ చేసిన పోరాటాన్ని గుర్తుచేసిన కొలికపూడి శ్రీనివాస్ రావు మందకృష్ణ మాదిగను ప్రత్యేకంగా అభినందించారు.