AP | గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ ప్రారంభం – తొలిసారి ట్యాబ్ ద్వారా ప్రశ్నాపత్రాలు పంపిణీ

విజయవాడ -ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించే గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ మెయిన్స్‌ పరీక్షలు మే 3 నుండి మే 9 వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా ఈ పరీక్షల కోసం ప్రశ్నాపత్రాలను ట్యాబ్ ద్వారా అభ్యర్ధులకు అందించడం విశేషం..
ఇక రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం వంటి నాలుగు ప్రధాన నగరాల్లో మొత్తం 13 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 4,496 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. వీరిలో విశాఖలో 1,190 మంది, విజయవాడలో 1,801 మంది, తిరుపతిలో 911 మంది, అనంతపురంలో 594 మంది అభ్యర్థులు ఉన్నారు.

పరీక్షా రోజున అభ్యర్థులు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్యలో తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో గరిష్ఠంగా 9:45 వరకు మాత్రమే ప్రవేశం అనుమతించబడుతుంది. ఆ తర్వాత వచ్చేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించరని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. అభ్యర్థులు హాల్‌ టికెట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. పరీక్ష సమయం ముగిసే వరకు అభ్యర్థులకు హాలులోనే ఉండాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *