వెలగపూడి – ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్ అఖిల భారత సర్వీసుల అధికారులకు నేషనల్ పెన్షన్ పథకం (NPS)కింద ఇచ్చే వాటా పెంచింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. ఏఐఎస్ అధికారులకు ప్రభుత్వం ఇచ్చే వాటాను 10 శాతం నుండి 14 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రంలో డిప్యుటేషన్‌పై ఉన్న అఖిలభారత సర్వీసు అధికారులకూ వర్తింప జేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది సర్కార్..
రాష్ట్ర సచివాలయం సహా విభాగాధిపతులుగా డిప్యుటేషన్ పై ఉన్న సిసిఎస్ అధికారులకూ వర్తింపు చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి.. 2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచి వాటా పెంపును అమలు చేయనున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది ప్రభుత్వం… ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్.