అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ షెడ్యూల్ విడుదలైంది. గతంలో ప్రకటించినట్లే మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస భర్తీకి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ 20న (ఆదివారం) నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 6 నుంచి జులై 6 వరకు సీబీటీ విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్టు షెడ్యూల్లోపేర్కొన్నారు.
AP| రేపే మెగా డి ఎస్ సి నోటిఫికేషన్ విడుదల
