AP CM | బిల్లు ఆమోదం ప్రజారాజధానికి దక్కిన గౌరవం

AP CM | బిల్లు ఆమోదం ప్రజారాజధానికి దక్కిన గౌరవం
AP CM | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని నాశనం చేయాలని ప్రయత్నిస్తే తాము శాసనం చేశామని అన్నారు.
దేశంలోని అన్ని పార్టీలది ఒక దారైతే వైకాపాది మరో దారి అని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర ప్రజల ఓట్లు పొందిన తర్వాత వైసీపీ రాష్ట్రానికి ద్రోహం చేసిందని ఆరోపించారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆ పార్టీ మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు.
ఈ బిల్లు ఆమోదం ప్రజారాజధానికి దక్కిన గౌరవమని చంద్రబాబు చెప్పారు. అమరావతిని నాశనం చేయాలని వైకాపా ప్రయత్నిస్తే, దానికి తాము శాసనం చేసి అడ్డుకట్ట వేశామని స్పష్టం చేశారు.
