Ap Cm Vision : అభివృద్ధి యాత్ర ఆగదు Andhra Prabha Real News

Ap Cm Vision : అభివృద్ధి యాత్ర ఆగదు Andhra Prabha Real News
అప్పుడు వాజ్ పేయి
ఇప్పుడు మోదీ స్ఫూర్తి
అమరావతి రైతులకు అండగా ఉంటాం
గేర్లు మారుస్తాం.. స్పీడ్ పెంచుతాం
పీపీపీ అంటే ప్రైవేటు కాదు.. పబ్లిక్
సుపరిపాలన దివస్ సభలో ఏపీ సీఎం
( తుళ్లూరు, ఆంధ్రప్రభ)

దేశం మెచ్చిన నేతగా మాజీ ప్రధాని వాజ్ పేయి చిరస్మరణీయులు. అందుకే ఆయన స్మారకాన్ని అమరావతిలో ఏర్పాటు చేసుకుంటున్నాం. అని ఏపీ చంద్రబాబు నాయుడు (Ap Cm Chandra Babu) అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి సందర్భంగా తుళ్లూరు మండలం వెంకటయపాలెంలె 15 అడుగుల వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని (Vajpayee Statue Unvailed) గురువారం సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సుపరిపాలన దివాస్ ను వేడుకగా నిర్వహించారు. ఈ సభలో జైభారత్, జై తెలుగు తల్లి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశాన్ని అణుశక్తిగా మార్చి ప్రపంచానికి భారతీయుల సత్తా చాటిన ధీశాలి అప్పటి ప్రధాని వాజ్ పేయి అన్నారు. మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం (Abdul Kalam) , దార్శనిక నేత వాజ్ పేయి ఇద్దరూ దేశం కోసం పని చేసిన నేతలని, అప్పటి కార్గిల్ యుద్ధం (Kargil war )లో వాజ్ పేయి, ఇప్పుడు సింధూర్ (Operation Sidhoor) లో ప్రధాని మోదీ భారత్ వైపు ఎవరైనా చూస్తే తగిన బుద్ధి చెబుతామని చాటారు, అని సీఎం వివరించారు.

Ap Cm Vision :
జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసిన ప్రయాణం కూడా అత్యంత కీలకమని, అటల్ బిహారీ వాజ్ పేయి మంచి వక్త, కవిగా, ప్రజా హృదయ నేతగా.. దేశ మౌలిక సదుపాయాలకు బలమైన పునాది వేశారు, అని సీఎం అన్నారు. వాజ్ పేయి ప్రతిపాదించిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రహదారిని మొట్టమొదట తడ .. –చెన్నై మధ్యే ప్రారంభించాం, నాలెడ్జి ఎకానమీకి వెన్నెముక టెలికామ్ సెక్టార్ ను (Telecom) డీరెగ్యులేషన్ (Deregulation) ప్రారంభించి ప్రగతికి వాజ్పేయి పునాది వేశారు, అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగు నేలలో అలాంటి స్పూర్తి ఇచ్చే నేత ఎన్టీఆర్ (NTR). వీరంతా చరిత్రను తిరగరాసిన నేతలు, నేషనల్ ఫ్రంట్ (National Front) ద్వారా కాంగ్రేసతర పార్టీలను ఏకం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. వాజ్ పేయి ఎన్టీఆర్ మధ్య సుదీర్ఘ అనుబంధం ఉంది, సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
Ap Cm Vision : ప్రధాని మోదీ హయాంలో..
ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ

4జీ రివల్యూషన్ ( 4G revolution) తో ముందుకు దూసుకెళ్తున్నారు, ఓపెన్ స్కై పాలసీ, నగరాల మధ్య రహదారులు లాంటి వివిధ సంస్కరణలు దేశ ప్రగతికి కీలక బిందువుగా నిలిచాయి. ఇప్పుడు పీపీపీ విధానంలో దేశాభివృద్ధికి బీజం వేసి ఆచరణలో పెట్టి ఇప్పుడు అగ్రస్థానానికి తీసుకెళ్తున్నాం. 11 స్థానంలో ఉన్న భారత దేశం, ప్రధాని మోదీ తెచ్చిన సంస్కరణలతో అగ్రస్థానానికి చేరుకోబోతోంది. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానానికి వస్తుంది. దేశాన్ని శిఖరాగ్రంలో నిలిపే శక్తి ప్రధాని మోదీకి ఉంది, అని సీఎం చంద్రబాబు విపులీకరించారు.
Ap Cm Vision : అమరావతిలో అటల్ జీ స్మారక చిహ్నం

ప్రజా రాజధాని అమరావతిలో అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించుకోవటం సంతోషంగా ఉంది. ప్రపంచం అంతా గుర్తించేలా అమరావతిని తీర్చిదిద్దటమే మా ధ్యేయం. స్పూర్తిదాత వాజ్ పేయి స్మృతి వనాన్ని అమరావతిలో నిర్మించడానికి ఇక్కడి రైతుల త్యాగమే స్పూర్తి. చరిత్ర గుర్తించే విధంగా అటల్ బిహారీ వాజ్ పేయికి ఘనమైన నివాళి ఇవ్వాలనే స్మృతి వనం నిర్మిస్తున్నాం.

(Atal Modi Supasipala Yatra) అటల్ మోదీ సుపరిపాలనా యాత్ర బీజేపీ ప్రారంభించింది. అమరావతిలో వాజ్ పేయి విగ్రహంతో పాటు ఆయన చరిత్ర, సుపరిపాలనను ప్రజలకు తెలిసేలా స్మృతివనం ఏర్పాటు చేస్తున్నాం. ఎన్టీఆర్ లాంటి నేతల్ని కూడా గుర్తుంచుకునేలా అమరావతిలో స్మారకాన్ని ఏర్పాటు చేస్తాం. సుపరిపాలన దివస్ గా అటల్ జీ జన్మదినాన్ని నిర్వహించుకుంటున్నాం. 26 జిల్లా కేంద్రాల్లో అటల్ విగ్రహాలను ప్రతిష్టించేలా కూటమి సంయుక్తంగా పనిచేసింది అని సీఎం చంద్రబాబు వివరించారు.
Ap Cm Vision : అమరావతి రైతులకు అండగా ఉంటాం

అమరావతిలో రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం. రాజధాని నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి గేరు మార్చి పనుల్ని వేగవంతం చేస్తాం. నాడు ప్రధాని హోదాలో హైటెక్ సిటీకి అటల్ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు అమరావతిలో క్వాంటం వ్యాలీని నిర్మిస్తున్నాం. అప్పుడు ఐటీ స్పీడు, ఇప్పుడు క్వాంటం జోరు. హైవేలు, పరిశ్రమలు, ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది.
Ap Cm Vision : గతంలో వాజ్ పేయి.. ఇప్పుడు మోదీజీ స్ఫూర్తి

గత పాలనలో రాష్ట్రం వెంటిలేటర్ On Ventilater) పై ఉంది. ఇప్పుడు కోలుకుని అభివృద్ధి ప్రయాణం మొదలు పెట్టింది. పీపీపీ ద్వారా మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు మోకాలడ్డుతున్నారు. మెరుగ్గా ప్రాజెక్టు నిర్మితం కావాలంటే పీపీపీ ద్వారానే వేగంగా జరుగుతుంది. గత 30 ఏళ్లుగా ఇదే నిరూపితం అయింది. పీపీపీ పద్దతిలో చేపట్టే మెడికల్ కాలేజీల నిర్మాణానికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (Voibility gap Funding) ద్వారా ఆర్ధిక మద్దతు కూడా ఇస్తున్నాం. గతంలో వాజ్ పేయి, ఇప్పుడు నరేంద్ర మోది స్పూర్తిని ఇస్తున్నారు.అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Ap Cm Vision : పీపీపీ అంటే ప్రవేటు కాదు..పబ్లిక్ పీపీపీ అంటే ప్రైవేటు కాదు ( Not Private) ప్రభుత్వ ఆస్తే. దానిని నిర్వహించి తిరిగి ప్రభుత్వానికే అప్పగిస్తారు. కాలేజీలు కడితే జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు… అలాంటి వ్యక్తుల నైజాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. వాజ్ పేయి లాంటి ఉన్నత నాయకులతో రాజకీయం చేసి.. ఇప్పుడు చిల్లర వ్యక్తులతో రాజకీయం చేయటం సిగ్గు అనిపిస్తోంది.ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈ అభివృద్ది యాత్ర అగదు. సంపద ఆరోగ్యం, ఆనందం ప్రజలకు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం, అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ALSO READ : Ap CM Request : సీఎం విన్నపాలు Andhra Prabha Real News
