AP | కలెక్టర్లకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్

త్వ‌ర‌లోనే మెగా డిఎస్సీ..
ఎస్పీ వ‌ర్గీక‌ర‌ణ‌తోనే నోటిఫికేష‌న్
త్వ‌రలోనే త‌ల్లికి వంద‌నం అంద‌జేత
కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు కీలక సూచనలు..
కలెక్టర్లు జిల్లా ముఖ్య నిర్వహణాఅధికారులు..
ఏసీ రూమ్‌లకు కలెక్టర్లు పరిమితం కావదన్న సీఎం..
విజన్ 2047పై ప్రధానంగా కలెక్టర్లు దృష్టి పెట్టాలని సూచన..

వెల‌గ‌పూడి – ఆంధ్ర‌ప్ర‌భ – కలెక్టర్లు జిల్లా ముఖ్య నిర్వహణా అధికారులు అన్నారు చంద్రబాబు. ఏసీ రూమ్‌లకు కలెక్టర్లు పరిమితం కావద్దన్నారు.. విజన్ 2047పై ప్రధానంగా కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు.. పెన్షన్లను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అన్నారు.. సోలార్ పవర్‌లో భాగంగా 20 లక్షల మందికి సోలార్ పవర్ ఇవ్వడంలో కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. భవిష్యత్ ను ప్లాన్ చేసే పనిలో కలెక్టర్లు ఉండాలని స్పష్టం చేశారు.. ప్రజల్లో అత్యంత ప్రభావం కలిగించే వ్యక్తి కలెక్టర్.. కెరీర్‌లో కలెక్టర్ , చీఫ్ సెక్రెటరీకి ఇవే ముఖ్యం అన్నారు..

ఎపి సచివాల‌యంలో నేడు ప్రారంభ‌మైన‌ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్‌న్యూస్ చెప్పారు. మెగా డీఎస్సీపై కీలక ప్రకటన చేశారు. .. డీఎస్సీపై స్పష్టత ఇచ్చారు. వచ్చే నెల (ఏప్రిల్) మొదటి వారంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రకటిస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణతోనే డీఎస్సీ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగిస్తూ, ఇక, రొటీన్‌గా ఉంటే ఏడాది అవుతుంది.. మరో నాలుగేళ్లు కూడా గడిచిపోతాయి అన్నారు సీఎం .. ఈ ప్రభుత్వం.. సంక్షేమం.. అభివృద్ధి.. సుపరిపాలన… ఈ మూడు గుర్తుండాలి.. ప్రజలు ఆనందంగా ఉండాలంటే సంక్షేమం కావాలి.. పెన్షన్ల విషయంలో ప్రభుత్వం చాలా ఉదారంగా ఉంది.. కేవలం పెన్షన్ల కోసం ఏడాదికి 33 వేల కోట్లు అవుతోందని వెల్లడించారు. అమరావతి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. ప్రజల్ని ప్రోగ్రెస్ లో భాగస్వామ్యం చేయాలన్నారు.. 20 లక్షల మందికి సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తాం.. ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్లు.. సోలార్ రూఫ్ టాప్ పై దృష్టి పెట్టాలన్నారు..

ప్రీ మాన్ సూన్ పోస్ట్ మాన్ సూన్ పై దృష్టి సారించాలి.. ప్రతి జిల్లా కలెక్టరు అరకు కాఫీ పై ఫోకస్‌ చేయాలన్నారు.. మరోవైపు, మే నెలలో తల్లికి వందనం ఇస్తాం.. త్వరలో విధి విధానాలు వస్తాయని తెలిపారు. 26 జిల్లాల కలెక్టర్ల పెర్ఫామెన్స్ పై సమీక్ష జరుగుతుందన్నారు. స్వర్ణాంధ్ర 2047.. వికసిత్ భారత్ పై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి పెట్టారు.. అందుకు అనుగుణంగా.. 175 నియోజకవర్గాలకు విజన్ డాక్యుమెంట్‌లు ఉంటాయన్నారు.. ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి చైర్మన్ గా ఉంటారని తెలిపారు సీఎం చంద్రబాబు..

తిరుగులేని తీర్పు..
వైసీపీ ప్రభుత్వ పాలనను ప్రజలు ఆమోదించలేదని.. అందుకే ప్రజలు కూటమికి తిరుగులేని తీర్పు ఇచ్చారన్నారు. ఐదేళ్లకు ఒకసారి ప్రజలు తీర్పు ఇస్తారన్నారు. సమస్యల పరిష్కారంలో కలెక్టర్లది కీలక పాత్ర అని చెప్పుకొచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే అందరి లక్ష్యమని వెల్లడించారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని అందరం కలిసి గాడిలో పెట్టాలన్నారు. రాష్ట్రాన్ని పునఃనిర్మాణం చేస్తామని హామీ ఇచ్చామని.. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన తమ విధానమని తెలిపారు. కలెక్టర్లు దర్పం ప్రదర్శించడం కాదని.. క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. సంక్షేమ పథకాలు లేకపోతే పేదరిక నిర్మూలన జరగదన్నారు. సంక్షేమం అమలు చేయాలంటే అభివృద్ధి జరగాలని అన్నారు. అప్పులు తెస్తే ఎంతకాలం కొనసాగిస్తామని ప్రశ్నించారు.

9 నెలల్లో అనేక హామీలు అమలు చేస్తూ వస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా రూ.4 వేలు పింఛన్‌ లేదు.. మనం ఇస్తున్నామన్నారు. దివ్యాంగులకు పింఛన్‌ రూ.6 వేలకు పెంచామని చెప్పుకొచ్చారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్‌ ప్రాజెక్ట్‌ అని అన్నారు. ప్రపంచంలోనే బెస్ట్‌ మోడల్‌తో అమరావతి అభివృద్ధి జరుగుతుందన్నారు. అన్న క్యాంటీన్లతో రూ.5కే భోజనం అందిస్తున్నామని.. దీపం-2 కింద ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. చెత్త పన్నును తొలగించామని తెలిపారు. 2027కు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడించారు. మే నెల నుంచి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *