AP CM | మాట నిలబెట్టుకున్న చంద్రబాబు..

AP CM | మాట నిలబెట్టుకున్న చంద్రబాబు..

AP CM | కొత్తచెరువు, ఆంధ్రప్రభ : ఇటీవల కొత్తచెరువు పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తచెరువులో జరిగిన బహిరంగ సభలో కొత్తచెరువు ఇండోర్ స్టేడియం నిర్మాణానికి రెండు కోట్లు మంజూరు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం.. కొత్తచెరువులోని శ్రీ సత్య సాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి రెండు కోట్లు నిధులు విడుదల చేయడంతో శనివారం పనులు ప్రారంభించారు. 2019 సంవత్సరంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి అప్పట్లో రెండు కోట్లు నిధులు మంజూరు కాగా పనులు ప్రారంభించిన తర్వాత ఎన్నికలు రావడం, ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో అధికారంలోకి వచ్చిన వైకాపా పార్టీ ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను నిలిపివేసింది.

తిరిగి మరల టీడీపీ అధికారంలోకి రావడంతో ఇటీవల కొత్తచెరువుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఇండోర్ స్టేడియం గురించి ఎమ్మెల్యే సింధూర రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇండోర్ స్టేడియం నిర్మాణానికి రెండు కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో చిత్తూరుకు చెందిన కాంట్రాక్టర్ పనులు దక్కించుకొని పనులు ప్రారంభించారు. నియోజకవర్గానికి మంజూరైన ఇండోర్స్ స్టేడియం నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో క్రీడాకారులు, యువకులు వాకర్స్ ఆనందం వ్యక్తపరిచారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే సింధూర రెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply