AP | అత్తమామలపై కక్షతో బావ దారుణం

AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడులో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఏడేళ్ల బాలుడు వేమ్ చంద్రను మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన బావ బోయ సర్వేశ్ దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

AP

పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న చిన్నారిని నిందితుడు తన వెంట తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. బాలుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా హత్య విషయం బయటపడింది.

పోలీసుల దర్యాప్తులో బాలుడిని బోయ సర్వేశ్ హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. వేమ్ చంద్ర అక్కను వివాహం చేసుకున్న సర్వేశ్, ఉగాది సందర్భంగా భార్యతో కలిసి అత్తారింటికి వచ్చినట్లు సమాచారం.

AP

అయితే తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదనే అసహనంతో అత్తమామలపై కక్ష పెంచుకున్నాడు. ఈ కక్షతోనే బాలుడిని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply