AP | ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించాలి – నారా లోకేష్‌కు ఆశ వ‌ర్క‌ర్ల విన‌తి

రాజ‌కీయాల్లో త‌మ‌ను లాగొద్ద‌ని విజ్ఞ‌ప్తి
సానుకూలంగా స్పందించిన లోకేష్

విశాఖపట్నం, ఆంధ్ర‌ప్ర‌భ‌: త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించాల‌ని మంత్రి నారా లోకేష్‌కు ఆశ వ‌ర్క‌ర్లు మొర పెట్టుకున్నారు. గ‌తంలో వైసీపీ రాజ‌కీయ స‌మావేశంలో తాము అప్ప‌టి ప్రాజెక్టు డైరెక్ట‌ర్‌ బాపూనాయడు ఒత్తిడితోనే పాల్గొన్నామని చెప్పారు. దాన్నీ దృష్టిలో ఉంచుకుని త‌మను తొల‌గించ‌వ‌ద్ద‌ని వేడుకున్నారు.. విశాఖ‌ప‌ట్నం ప‌ర్య‌ట‌న‌కు లోకేష్ వ‌చ్చిన సంద‌ర్భంగా ఆశ వ‌ర్క‌ర్ల ప్ర‌తినిధి బృందం శ‌నివారం ఆయ‌న‌ను క‌ల‌సింది.. తమను రాజకీయాల్లోకి లాగొద్దని.. ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగించాలని, మూడు సంవత్సరాల కాలపరిమితి సర్క్యూలర్ రద్దు చేయాలని విన్న‌వించారు. తమ మీద పని ఒత్తిడిని తగ్గించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. తమపై రాజకీయ వేధింపులు లేకుండా చూడాలని, పని భద్రత కల్పించాలని ఆశ వర్కర్లు కోరారు. దీనిపై స్పందించిన లోకేష్.. వారి స‌మ‌స్య‌ల‌ను సానుభూతితో ప‌రిశీలించి న్యాయం చేస్తాన‌ని భ‌రోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *