- పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చేలా పాలసీలు..
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : రాష్ట్రంలోని డిపెన్స్ అండ్ ఏరోస్పేస్ పాలసీ దేశంలోనే అత్యత్తుమ పాలసీగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరిక అని డిఫెన్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాద్ పేర్కొన్నారు.
ఆ విధంగా పాలసీ రూపకల్పన చేసేందుక అధ్యయం చేస్తున్నామన్నారు. ఢిపెన్స్ అండ్ ఏరోస్పెస్ పరిశ్రమలు ఎపికి తీసుకువచ్చి రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిఫెన్స్, ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ పాలసీ, క్లస్టర్‌ల రూపకల్పన కోసం సోమవారం నగరంలోని ఒక హోటల్లో ప్రత్యేక సెమినార్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.వో మాజీ చైర్మన్ ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గౌరవ సలహదారుడు డాక్టర్ జి.సతీశ్ రెడ్డి, ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చైర్మన్ ఎస్పీ సోమనాథ్, ఐ అండ్ సి అండ్ ఎఫ్.పి సెక్రటరీ ఎన్.యువరాజ్ ఐ.ఎ.ఎస్ అధికారి, ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఎమ్.అభిషిక్త్ కిషోర్ ఐ.ఎ.ఎస్ అధికారి, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ అజయ్ మిశ్రా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎంపి చిన్ని మాట్లాడుతూ… ఎపిలో ఏర్పాటు కాబోయే డిపెన్స్ పరిశ్రమలు దేశంలోనే ముందు ఉండే విధంగా డిఫెన్స్, ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ పాలసీ, క్లస్టర్ రూపకల్పన అత్యుత్తమ పాలసీ తీసుకురాబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని సహజ వనరులతో పాటు రోడ్డు, రైలు, విమాన మార్గాలతోపాటు జలరవాణాకు అనుకూలంగా ఉంటుందన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా దేశంలోనే వంద శాతం రక్షణ రంగ ఉత్పత్తులు తయారికీ ప్రణాళిక సిద్దం చేశారన్నారు. ప్రస్తుతం దేశంలో 61 శాతం మాత్రమే డిఫెన్స్ అండ్ ఏరో స్పెస్ ఉత్పత్తుల తయారీ అవుతున్నాయనీ, మిగిలిన 40 శాతం పరిశ్రమలను వృద్ది చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు.
సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర ప్రదేశ్ 2047 లో భాగంగా డిపెన్స్ పరిశ్రములు ఏరో స్పెస్ క్లస్టర్లు అభివృద్ది కంకణం కట్టుకున్నారని తెలిపారు. రాష్ట్రం భవిష్యత్తులో క్వాంటం కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పారిశ్రామిక జోన్లు ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి విధివిధానాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ డిఫెన్స్ పరిశ్రమలకు హబ్ గా తయారు కానుందని స్పష్టం చేశారు.
ఈ సెమినార్ కి దేశం మొత్తం 17 డిఫెన్స్ పి.ఎస్.యులు ఉంటే 7 డిఫెన్స్ పి.ఎస్.యులు హాజరు కాగా, మిగిలిన వారు మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. వీరితో పాటు ఈ సెమినార్ లో గోవా షిప్ యార్డ్ హిందూస్థాన్ షిప్ యార్డ్ , హెచ్.ఎ.ఎల్ రక్షణ రంగానికి సంబంధించిన ప్రతినిధులు హైదరాబాద్ లో వున్న డిపెన్స్ కి పనిచేసి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, విజయవాడ, వైజాగ్ నుంచి ఇండస్ట్రీయలిస్టులు పాల్గొన్నారు. వీరంతా సెమినార్ లో పాల్గొని పాలసీ తయారు విషయంలో సలహాలు సూచనలు అందించారు.