AP | రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి..

AP | రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి..

AP | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ప్రాణత్యాగం చేసిన మహానీయుల త్యాగఫలమే కారణమని.. నేటి స్వేచ్ఛాయుత భారతమని, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను తెలుసుకుంటూ బాధ్యతలు నిర్వర్తించినప్పుడే నిజమైన పౌరసత్వం అవతరిస్తుందని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది, ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ గణతంత్ర దినోత్సవం మన దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకునే పవిత్ర దినం. వారి అమూల్య త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాతావరణంలో జీవిస్తున్నాం. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను తెలుసుకుంటూనే, మన బాధ్యతలను కూడా నిబద్ధతతో నిర్వహించాలి. ప్రతి పౌరుడు దేశ పురోగతికి తన వంతు కృషి చేయాల్సిన సమయం ఇదే అని పిలుపునిచ్చారు. దేశభక్తి నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగగా, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply