AP | ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించాలి

AP | ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించాలి
- ఎమ్మెల్యే కార్యాలయంలో నివాళులు
AP | తిరువూరు, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ (NTR) చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని నాయకులు కార్యకర్తలు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బొమ్మసాని మహేష్, గడ్డి కృష్ణారెడ్డి, సింధు శ్రీనివాసరావు, ఆకుల ప్రసాద్, తోరి కృష్ణ, హన్నీ, మార్కెండేశ్వరావు, తర్రిగోప్పుల హుస్సేన్, రాజవరపు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, మీనుగు శ్రీను, మొహిద్దీన్, గోసు చిన్ని, నామ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
