గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత..

గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత..

గుడ్లవల్లేరులో పర్యటించిన ఎమ్మెల్యే…

గుడ్లవల్లేరు – ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గ్రామాల్లో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని, అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

గుడ్లవల్లేరు మండలంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోమవారం విస్తృతంగా పర్యటించారు.
ముందుగా గుడ్లవల్లేరు మార్కెట్ యార్డ్ కమిటీ ఆధ్వర్యంలో కట్టవాని చెరువు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన పశు వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. శిబిరంలో అందిస్తున్న చికిత్సల వివరాలను వెటర్నరీ వైద్యులు ఎమ్మెల్యే రాముకు తెలిపారు. ఈ సందర్భంగా పశువులకు వ్యాధి నిరోధక మందులను పాడి రైతులకు ఎమ్మెల్యే రాము ఉచితంగా పంపిణీ చేశారు.

అనంతరం రూ.1.10 కోట్లతో నిర్మితమవుతున్న కట్టవాని చెరువు – తాడిచర్ల రోడ్డు నిర్మాణ పనులకు తాడిచర్ల గ్రామంలో ఎమ్మెల్యే రాము భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ…. గత ప్రభుత్వ అస్థవ్యస్థ పాలనలో గ్రామాల అభివృద్ధికి దూరంగా సమస్యలకు నిలయంగా ఉండేవన్నారు. కొన్ని గ్రామాల్లో పరిస్థితులు మరి దుర్భరంగా ఉండేవని నాటి రోజులను గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలన్ని సస్యశ్యామలంగా మారుతున్నాయన్నారు.గ్రామాల్లో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పునరుద్ఘాటించారు.

అనంతరం పశుబోట్ల వానిపాలెం, గాదెపూడి గ్రామాల్లో ఎమ్మెల్యే రాము పర్యటించారు.

ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, గుడ్లవల్లేరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరు రవి, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ శాయన పుష్పావతి,శ్రీ కొండల్లమ్మ దేవస్థాన ధర్మకర్తల కమిటీ చైర్మన్ ఈడే మోహన్, మండల కూటమి నాయకులు పోలవరపు వెంకట్రావు, కొడాలి రామరాజు, మల్లిపెద్ది సుబ్రహ్మణ్యం, ధనకోటి, రమేష్,రాజు,చిత్రం రామారావు, మల్లికార్జున రావు, డి సి పాలేటి ఆంజనేయులు,పేర్ని జగన్ పిచ్చేశ్వరావు,చిట్టి బొమ్మ వీర్రాజు, కాగిత నరేంద్ర, బొర్ర మధు, బొర్ర ప్రసాద్, షేక్ నాగూర్,సత్య సాయి,వల్లభనేని సుబ్బారావు,తూము పద్మజ, దివ్య చౌదరి,నాగలక్ష్మి కట్టవాని చెరువు గ్రామ నాయకులు వెంకయ్య, కరీం, రాంబాబు,మోబిన్, శ్రీనివాసరావు, దావీదు, తాడిచర్ల గ్రామ నాయకులు జన్ను లక్ష్మీ రాణి, అంజిబాబు, జన్ను శివకుమార్, కొప్పుల దుర్గ, పళ్లెం ఆదిశేషు, వెంకటేశ్వరరావు, వేమన ఆదిశేషు, మోషే, బాలకృష్ణ, పలువురు అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply