పదవులు పార్టీకి అలంకారప్రాయాలు..

పదవులు పార్టీకి అలంకారప్రాయాలు..

పాయకాపురం, ఆంధ్ర ప్రభ : పదవులు పార్టీకి అలంకారప్రాయాలని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. గుంటూరు శ్రీసీతారామయ్య ట్రస్ట్ బోర్డు ఛైర్మన్, కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం శుక్రవారం పాయకాపురం ప్రాంతంలోని కల్యాణ మండపంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొని ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కోలా శ్రీను, డైరెక్టర్లు దేవరకొండ లక్ష్మణ్,రమణమ్మ ట్రస్ట్ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.టీడీపీ, కూటమి పార్టీ బలోపేతంకొరకు కష్ట పడిన ప్రతి ఒక్కరికి ఉన్నత పదవులు ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు.ఈకార్యక్రమంలో ఘంటా కృష్ణ మోహన్, నవణితం,లబ్బ వైకుంటం,బొమ్మదేవర రత్న కుమారి,పైడి శ్రీను,మోతుకురి ఖాసిమ్,ఆకుల సూర్యప్రకాష్,కంచేటి నాగరాజు, పసుపులేటి వీరాస్వామి,బుదాల సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply