స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి..

స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి..
వైసీపీ కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే దిశా నిర్దేశం..
నంద్యాల బ్యూరో ఏప్రిల్ 3 ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రాజకీయవేడి రగులుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వార్డుల విభజన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అధికారికంగా కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఎత్తింది.ఈ మేరకు నంద్యాల జిల్లాలో మున్సిపాలిటీలో పలు వార్డుల సంఖ్య పెరిగింది. దీంతో స్థానిక ఎన్నికలైనా సర్పంచు ఎంపీటీసీ, జడ్పిటిసి మున్సిపల్ ఎన్నికలకు సమాయుత్తమ అయ్యేందుకు నియోజకవర్గ ప్రజాప్రతినిధుల కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి శుక్రవారం ఆత్మీయ సమావేశం..దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసిపోయింది. మున్సిపల్ చైర్మన్ ల కౌన్సిలర్ల పదవీకాలం ముగిసిపోయింది.
స్థానిక సంస్థల పదవీకాలం ముగిసిపోవడంతో కార్యకర్తలను ఎన్నికల సిద్ధం చేసేందుకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, నంద్యాల మరియు గోస్పాడు మండలాలకు చెందిన ఎంపీపీలు, సర్పంచ్‌లు, వైస్ సర్పంచ్‌లు మరియు ఎంపీటీసీలతో భారీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష, మరియు మాజీ రాష్ట్ర మార్కెఫెడ్ చైర్మన్ పీపీ నాగిరెడ్డి పాల్గొని ప్రజాప్రతినిధులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా శిల్ప మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికలే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. వైసీపే నాయకత్వంలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, రాబోయే ఎన్నికల్లో పార్టీ అత్యధిక మెజారిటీతో మళ్ళీ అధికారాన్ని చేపట్టేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం పరిశీలకుడు పీపీ మధుసూధన్ రెడ్డి,ఎంపీపీలు శెట్టి ప్రభాకర్, ఆర్థర్ సైమన్, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి. మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు పురుషోత్తం రెడ్డి, మహేశ్వరరెడ్డి, వైసిపి జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్,వైసీపీ జిల్లా కార్యదర్శి శివనాగిరెడ్డి, బసవేశ్వరరెడ్డి, ప్రహ్లాదరెడ్డి, సర్పంచులు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమావేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు.
