ఉరవకొండలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

ఉరవకొండలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఉరవకొండ పట్టణంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు ప్రతిపాదించిన పసుపు జెండా ఆశయాలను స్మరించుకుంటూ కార్యక్రమాన్ని చేపట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జెండాను మండల టిడిపి కన్వీనర్ విజయభాస్కర్, ఉరవకొండ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ దేవినేని పురుషోత్తంలు ఆవిష్కరించారు. అనంతరం నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూల మాలలు వేసి, నివాళులర్పించారు. కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేసి, సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడి పనిచేస్తున్న సీనియర్ టిడిపి పార్టీ నాయకులకు ఘనంగా సన్మానించి, సత్కరించారు.
వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి, నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టాలని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు ఘనంగా సన్మానించి సత్కరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుండి కవిత హోటల్ సర్కిల్ వరకు, ఎన్టీఆర్ చిత్రపటాన్ని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పెన్నాహోబిలం ఆలయ చైర్మన్ రేగాటి నాగరాజు, ఉరవకొండ సింగల్ విండో అధ్యక్షుడు ప్యారం కేశవ, మాజీ ఎంపీపీలు కుళ్లాయప్ప, నాగేశ్వరరావు, సుంకరత్నమ్మ, మాజీ సర్పంచులు ఇంద్రావతి ఓబులేసు, వెంకటేశులు, ఉరవకొండ పట్టణ టిడిపి కన్వీనర్ రామాంజనేయులు, కండక్టర్ తిమ్మప్ప, ముష్టూర్ గుండ్రాయప్ప, వరప్రసాద్, షేక్ షాన్ పల్లి రఘురాములు, సిద్ధప్ప, రాంబాబు, సుధాకర్, రామకృష్ణ, మహమ్మద్ రఫీ, రామాంజనేయులు, నిరంజన్ గౌడ్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
