వైభవంగా సీతారామ కళ్యాణ మహోత్సవం..

వైభవంగా సీతారామ కళ్యాణ మహోత్సవం..

పాల్గొన్న కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం దంపతులు

ఆంధ్రప్రభ జగ్గయ్యపేట : త్రిపురవరం గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం లో సీతారామ కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడింది. కొల్లి మార్షల్ స్టాలిన్, గ్రామస్తుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, నెట్టెం స్వర్ణ కుమారి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీతారాముల కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించగా, వేద మంత్రోచ్చారణల మధ్య భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దివ్య దర్శనం పొందారు. నెట్టెం రఘురాం దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించారు. గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యంలో కళ్యాణోత్సవాన్ని వీక్షించారు. నిర్వాహకులు భక్తులకు ప్రసాదాల పంపిణీ చేపట్టారు. సీతారాముల కల్యాణం లోకకళ్యాణానికి ప్రతీకగా నిలుస్తుందని, ఈ వేడుకలు గ్రామంలో ఐక్యత, ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయని స్థానికులు పేర్కొన్నారు.

Leave a Reply