ఆ ప్రాంతంలో విషాద వాతావరణం

ఆ ప్రాంతంలో విషాద వాతావరణం

మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రభ : మార్కాపురం జిల్లా మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అనంతరం ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. నిన్న జరిగిన ఈ దుర్ఘటనలో 14 మంది సజీవదహనం కావడంతో మృతుల కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఈరోజు మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ప్రమాద స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. దగ్ధమైన బస్సు, టిప్పర్ లారీ అవశేషాలు చూసి వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ తమ వారిని గుర్తు చేసుకుంటూ కొందరు విలపించగా, మరికొందరు నిశ్శబ్దంగా అక్కడి పరిస్థితులను పరిశీలించి వెనుదిరిగారు. స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించగా, బాధితులకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపగా, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply