వడపప్పు, పానకం ప్రసాదాలు పంపిణి

వడపప్పు, పానకం ప్రసాదాలు పంపిణి

మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా సీతారాముల వారి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం వడపప్పు, పానకం ప్రసాదాలను ఆలయ డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వాహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు చేతుల మీదుగా భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపర్డెంట్ అచ్యుత మధుసూదన్ రావు, ఆలయ సిబ్బంది, పూజారులు, భక్తులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply